![]() |
![]() |

స్టార్ 'మా'లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -503 లో.. భద్రవతి ఇంటికి కోర్ట్ నుంచి నోటీసులు వస్తాయి. అమూల్యని విషయంలో విశ్వ చేసిన తప్పుకి ధీరజ్ కేసు పెట్టించినదానికి సంబంధించిన నోటీసులు చూసి భద్రవతి షాక్ అవుతుంది. ఇప్పుడు విశ్వకి శిక్ష పడకుండా ఎలా కాపాడుకోవాలని భద్రవతి అంటుంది. ఎందుకు రామరాజు దగ్గరికి వెళ్లి కేసుని క్లోజ్ చెయ్యమని చెప్తే సరిపోతుందని పెద్దావిడ సలహా ఇస్తుంది. దాంతో భద్రవతి తనపై కోప్పడుతుంది. వాడి దగ్గర నేను తగ్గడమేంటి.. ఆస్తులన్నీ పోయినా సరే నా మేనల్లుడుకి శిక్ష పడకుండా చేస్తానని భద్రవతి అంటుంది.
మరొకవైపు రామరాజు ఇంటికి కూడా నోటీసులు వస్తాయి. అమూల్య వచ్చి సాక్ష్యం చెప్పాలని అందులో ఉంటుంది. ఇప్పుడు అమూల్య కోర్ట్ కి వెళ్లాలా అని భద్రవతి అంటుంది. నోటీసులో ఉంటుంది. అప్పుడే రేవతి పెద్దావిడ రామరాజు దగ్గరికి వచ్చి.. మీరు కేసు వెనక్కి తీసుకోండి.అప్పుడే నా కొడుకుకి శిక్ష పడదని రేవతి అంటుంది. వాడు చేసిన పనికి కేసు వెనక్కి తీసుకోవడం ఉండదని ధీరజ్ అంటాడు. అన్నయ్య మీరు అయిన ఆలోచించండి అని రేవతి అంటుంది. అన్నయ్య అని పిలిచావ్.. ఏ సాయం అయినా చేస్తాను కానీ ఈ విషయంలో ఏ హెల్ప్ చెయ్యలేనని చెప్పి రామరాజు వెళ్ళిపోతాడు. మరొకవైపు అమూల్య కాలేజీ నుంచి వస్తున్న దారిలో విశ్వ తన కార్ తో అక్కడికి వస్తాడు. అప్పుడే అమూల్య దగ్గరికి ధీరజ్ వచ్చి తీసుకొని వెళ్తాడు. అమ్మో ఇప్పుడు వాడు వచ్చాడేంటని విశ్వ టెన్షన్ పడుతుంటాడు.
ఆ తర్వాత అమూల్యని ఇంటి దగ్గర దింపి ధీరజ్ మళ్ళీ వస్తాడు. ధీరజ్ ని చూసి విశ్వ షాక్ అవుతాడు. ఏంట్రా నా చెల్లి వచ్చే దారిలో ఏం చేస్తున్నావ్.. మళ్ళీ పోలీసులకి ఫోన్ చేసి చెప్పాలా అని ధీరజ్ అనగానే విశ్వ భయపడుతాడు. ఇంకొకసారి ఇలా చేసావంటే నీ సంగతి చెప్తానని వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు వల్లిని నర్మద, ప్రేమ కచేరికి రమ్మని చెప్తారు. దాంతో స్నాక్స్ కూల్ డ్రింక్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. రావనుకున్న అక్క వచ్చావని ప్రేమ అంటుంది. నేను రాకపోతే మీరే నా దగ్గరికి వస్తారు కదా అని వల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |